Log in
English

భగవద్గీత- సాంఖ్య యోగా- అధ్యాయం 2.55-2.59

Jul 13th, 2024 | 2 Min Read
Blog Thumnail

Category: Bhagavad Gita

|

Language: Telugu

సంధర్భం:
కురుక్షేత్ర  యుధ్ధములో భ్రాంతితో  తన కర్తవ్యం నిర్వర్తించలేక దిశానిర్దేశం చేయమని అడిగిన అర్జునితో భగవాన్ శ్రీ కృష్ణుడు ఆత్మ తత్త్వం మరియు స్వధర్మం  గురించి భోదించి, స్వధర్మాన్ని ఎలా అనుసరించాలి భోదిస్తాడు. 

ఆ భోధన విన్న తరువాత అర్జునుడు "స్థితప్రజ్ఞ" యొక్క లక్షణం ఏమిటని అడుగగా, శ్రీ కృష్ణుడి జవాబు మనం ఇప్పుడు చూడ బోతున్నాము. 

55 నుండి 59 శ్లోకముల సారాంశము:
మనస్సుని వేధించే (ప్రలోభపెట్టే, భ్రాంతికి గురిచేసే) అన్ని స్వార్థ ప్రయోజనములు (భగవంతుని సేవకు తప్ప) ఇంద్రియ వాంఛలను వదలి ఆత్మ జ్ఞానంలో స్థిరమయినపుడు/ ఆనందంచెందినపుడు ఆ వ్యక్తిని స్థితప్రజ్ఞుడని అంటారు.

స్థిత ప్రజ్ఞులు దుఃఖములలో కలత చెందరు, సుఖములను ఆశించరు మరియు మమకారము, భయము, క్రోధమును విడచి వుంటారు. 

వీరు సౌభాగ్యానికి సంతోషపడరు మరియూ కష్టాలకు కృంగిపోకుండా పరిపూర్ణ జ్ఞానము కలిగి ఉంటారు.

ఒక కూర్మం (తాబేలు) ఏ విధముగానయితే అపాయం లో  బయట ఉన్న శరీర భాగాలన్నింటినీ గట్టి గల్ల అయిన  రక్షణ పోర(shell) లోనికి లాగేసుకుంటుందో అలాగే స్థితప్రజ్ఞులు తమ ఇంద్రియములను వాటి భోగములనుండి మరియు వాంఛలనుండి వెనుకకు లాగేస్తారు(భగవంతుని లీలల మీద గుణముల మీద కేంద్రీకరిస్తారు).

ఇలా అనునిత్యము  అనుక్షణము నియంత్రించినా మనుషులకు ఇంద్రియ విషయాల మీద రుచి ఉండిపోతుంది. భగవంతుని తత్వమును అర్థంచేసుకున్నపుడు మాత్రమే ఈ రుచి  అంతమవుతుంది.

ఉదాహరణ:
మనుషులకు డబ్బు ఎంత ఉన్నా ఇంకా కావాలని అనిపిస్తుంది. కానీ  బ్యాంకు లో పనిచేసే క్యాషియర్ ప్రతి రోజు డబ్బుతో పనిచేసినా ఆ డబ్బు  తనది అనుకోడు. అలాగే మనమూ సుఖదుఃఖములలో మనసును సమత్వం లో ఉంచుకోవాలి.

ఒక వేళ డబ్బు తనది అని వాడుకొంటె అది నేరం అవుతుంది. అలాగే మనం కూడా మన పని చేయాలి కానీ భగవద్గీత 2వ అధ్యాయం 47వ శ్లోకంలో భగవంతుడు భోదించినట్టు ఫలితం మీద హక్కులేదని గుర్తుచేసుకుని, కర్మఫలం  ఆ భగవంతునికే వదిలేయాలి. 

అలా వదలకుండా ఫలితం మనదని అనుకున్నపుడు కర్మచే బంధింపబడి దీనివలన కొత్తగా పుట్టే కోరికలను తీర్చుకోవడానికి మరిన్ని కర్మలను చేసి కర్మ అనే చక్రం లో బంధీలమవుతాము. 

అదనపు సమాచారము:
మన నిత్య జీవితములో స్థితప్రజ్ఞులు ఎలా ఉంటారు! స్థితప్రజ్ఞుల లక్షణములు తెలుసుకొన్న మనము ఈ జ్ఞానమును ఎలా వినియోగించవచ్చు! అని సందేహం కలిగితే, జగద్గురువులు అయినా కృపాలూజీ మహారాజ్ గారిని మన ఆధ్యాత్మిక  గురువులు అయిన స్వామీ ముకుందానంద గారిని ఉదాహరణగా తీసుకొనవచ్చు.

వచ్చేవారం:
స్థిత ప్రజ్ఞుడికి ఇంకా ఎలాంటి లక్షణాలు ఉంటాయి! మనుషులు అందరూ  స్థితప్రజ్ఞులు  ఎందుకు  కాలేకపోతున్నారు!  అలా అవడానికి అవరోధం ఏమిటి! నిత్యజీవితంలో మనం చేసే పనుల వలన ఎలా కర్మబంధంలో చిక్కుకు పోతున్నాము! అనే అంశాలమీద చర్చిద్దాము.

సూచన:
స్థితప్రజ్ఞ లక్షణములు  మరియు  ఇంద్రియార్థముల వలన కలిగే కర్మబంధనము గూర్చి మరింత సమాచార ఉదాహరణల కొరకు Reference Book   భగవద్గీత  - భగవంతుని మధురవాణి  స్వామి ముకుందానంద గారి వ్యాఖ్యానము తప్పక చదవండి.

మీ యొక్క సందేహముల జవాబు కొరకు, మరియూ భగవద్గీతను మరింతగా అర్థం చేసుకొనుటకు ప్రతి సోమవారం నుండి శుక్రవారం 7:30AM  నుండి to  8:30AM  వరకూ జరిగే భగవద్గిత సంభాషణలో భాగం వహించండి.  అలా వీలు కానిచో  వచ్చే వారం మళ్ళీ ఈ బ్లాగ్ ను చదవండి. 

సారాంశం: JKYog India Online Class- భగవద్గీత [తెలుగు]- 11 జూలై నుండి 12 జూలై 2024 వరకు