సందర్భము:
క్రిందటి వారము మనము పండితుల(దివ్య ఆధ్యాత్మిక జ్ఞానములో ఉన్నవారు) లక్షణములు గూర్చి చదివాము . తరువాత పండితులు, ఒక బ్రాహ్మణుడని, ఒక ఆవును, ఒక ఏనుగును, ఒక కుక్కను మరియూ ఒక చండాలుడని సమదృష్టితో భగవంతునిలో భాగముగా చూసి, ఈ జన్మలోనే జనన మరణ చక్రమును జయించి, భగవంతుని యొక్క దోషరహిత గుణములను కలిగి ఉండుట వలన భగవంతుడే అన్నిటికీ మూలమనే పరమసత్యములో ఎల్లప్పుడూ స్థితులయి ఉంటారని చదివాము .
ఈ వారము మనము ఎటువంటి వారికి మోక్షం లభిస్తుందో మరియూ మోక్షం ఎలా లభిస్తుందో చదువుదాము
26 నుండీ 29 శ్లోకముల సారాంశము:
నిరంతర ప్రయత్నముతో రాగ ద్వేషముల 'ఫలములయిన కామ క్రోధముల నుండి బయటపడి దివ్య ఆధ్యాత్మిక జ్ఞానములో(ఆయమజ్ఞానములో ) ఉన్న సన్యాసులకు(పండితులకు) రాగద్వేషములతో కూడిన జీవితము నుండి విముక్తి లభిస్తుంది.
అలా రాగద్వేషములు వదలి దృష్టిని కనుబొమ్మల మధ్య కేంద్రీకరించి ముక్కు ద్వారా శ్వాస మరియు నిశ్వాసలను సమానముగా చేసి ఇంద్రియములను మనస్సును, బుద్ధిని రాగద్వేషాల నుండి ప్రాపంచిక విషయాల నుండి వేరు చేయగలిగిన వారికి మోక్షం లభిస్తుంది .
అన్ని యజ్ఞముల మరియూ తపస్సుల ఫలములను అనుభవించగలిగినది, అన్ని లోకములకు అధిపతి మరియూ అన్ని ప్రాణులకు నిస్వార్థ (బదులు ఆశించని) మిత్రుడు భగవంతుడే (శ్రీ కృష్ణ పరమాత్ముడే) అని తెలుసుకున్న తరువాత భక్తునికి శాంతి లభిస్తుంది.
ఈ వార సారాంశము ఇంతటితో సమాప్తము.
వచ్చేవారం మనము కర్మయోగమును ఆత్మజ్ఞానములో(దివ్య ఆధ్యాత్మిక జ్ఞానములో) స్థితులయినవారి ఆధ్యాత్మిక ఉన్నతికి ధ్యానము ఎలా సహాయపడుతుందో మనము 6వ అధ్యాయము - ధ్యానయోగములో చదువుదాము .
26 నుండీ 29 శ్లోకముల గూర్చి మరింత సమాచారమూ మరిన్ని ఉదాహరణాల కొరకు Reference Book భగవద్గీత - భగవంతుని మధురవాణి స్వామి ముకుందానంద గారి వ్యాఖ్యానము తప్పక చదవండి.
మీ యొక్క సందేహముల జవాబు కొరకు, మరియూ భగవద్గీతను మరింతగా అర్థం చేసుకొనుటకు ప్రతి బుధవారం నుండి శుక్రవారం 7:30AM నుండి to 8:30AM వరకూ జరిగే భగవద్గీత సంభాషణలో భాగం వహించండి. అలా వీలు కానిచో వచ్చే వారం మళ్ళీ ఈ శీర్షికను చదవండి.
సారాంశం: JKYog India Online Class- భగవద్గీత [తెలుగు]- 25 నుండి 26 సెప్టెంబర్ 2024 వరకు.