Log in
English

భగవద్గీత- సాంఖ్య యోగా- అధ్యాయం 2.47-2.54

Jul 6th, 2024 | 2 Min Read
Blog Thumnail

Category: Bhagavad Gita

|

Language: Telugu

సందర్భం:
కురుక్షేత్రంలో యుద్ధం అర్జునుడు  "మనం ఈ శరీరమనీ , కౌరవులలో ఉన్న తనకు అత్యంత గౌరవప్రదమయిన భీష్మాచార్యులనూ, తన పూజ్య గురువు అయినా ద్రోణాచార్యులనూ ఎలా చంపడం అని భ్రాoతి  చెందుతాడు. 

అపుడు శ్రీ కృష్ణ భగవానుడు మన ఉనికి ఆత్మ అనీ తాత్కాలికమయిన  శరీరం కాదనీ చెప్పి ఆత్మతత్వం భోదించి మరియూ అర్జునుడి  స్వధర్మాన్ని అనుసరించి  యుద్ధం చేయమని చెపుతాడు. 

ఒకవేళ అర్జునుడు స్వధర్మం కాదని యుద్ధం చేయకపోతే శత్రువులచే పిరికివాడుగా, తనను మహావీరుడిగా మెచ్చూకునే వారందరిచేతా అసమర్థుడిగా ముద్ర వేయబడి అపకీర్తికి లోనౌతాడని భోధిస్తాడు. 

తరువాత స్వధర్మాన్ని బుధ్ది యోగం ద్వారా అనుసరించామని భోదిస్తూ, ఇలా చేస్తే ఎటువంటి వ్యతిరేకఫలములు కలుగకొండా, కొద్దిపాటి సాధన గొప్ప మేలు చేయునని సెలవిస్తాడు.

ఇప్పుడు మనము స్వధర్మాన్ని నిర్వర్తించడం గూర్చి భగవాన్ శ్రీ కృష్ణుడు బోధించిన చాలా గొప్ప వాక్యములను చూద్దాము:

47 మరియు 48 శ్లోకముల సారాంశము:
శాస్త్రాన్ని అనుసరించి నీ యొక్క కర్తవ్య కర్మను (స్వధర్మాన్ని) అనుసరించటానికి మాత్రమే నీకు హక్కు ఉన్నది, కానీ ఆ కర్మ ఫలముల పయిన నీకు ఎలాంటి హక్కూ లేదు. నీ ద్వారా ఈ కర్మ ఫలములు ఉత్పన్నమవుతున్నవని అని అనుకొనరాదు మరియు కర్మఫలము నీది కానందున నీవు కర్మ చేయుట మానరాదు. 

జయాపజయములపట్ల  మమకారమును వదలి కర్తవ్య నిర్వహణలో స్థిరముగా ఉండుటయే "బుధ్ధి యోగము" అనబడుతుంది బోధించెను

49 నుండీ 54 శ్లోకముల సారాంశము:
ఓ అర్జునా! నీ కర్తవ్యమును  ఫలాపేక్ష లేకుండా చేయుము. దివ్యమయిన ఆధ్యాత్మిక జ్ఞానమును ఆశ్రయించి, బుద్ధిని ఆధ్యాత్మిక జ్ఞానములొ స్థిరముగా ఉంచి నీ కర్తవ్యమును చేయుము. తమ కర్మఫలములను భోగించగోరువారు లోభులు/పిసనారులు.

ఉదాహరణ:

ఒక వేళ కర్మఫలముపై ఆసక్తి లేకుండా పని చేస్తే మనము బాగా పని చేయలేమని సందేహం కలిగితే, మనం వైద్యులను ఉదాహరణగా తీసుకొనవచ్చు. 

ఒక వైద్యుడు ఫలం ఆశించకుండా  శాస్త్ర చికిత్స (surgery) చేయునపుడు మరింత నైపుణ్యంతో పనిచేయగలడు

వివేకముతో (కర్మల మీద మాత్రమే నాకు హక్కు ఉన్నది, వాటి ఫలముల మీద కాదు అని ఎరగి) ఈ కర్మశాస్త్రమును ఆచరణలో పెట్టినవాడు ఈ జన్మ లోనే పుణ్య పాపములను త్యజించును. కావున బుధ్ధి యోగ దృక్పదమున వివేకముతో పని చేయుము.

జ్ఞానులు, సమత్వ బుద్ది కలిగి ఉండి జనన మరణ చక్రములో బంధించే కర్మఫలములయిన మమకార-ఆసక్తులను వదిలివేయడం వలన దుఃఖ రహితమయిన స్థితిని పొందుతారు. 

యుద్ధములో గెలుపూ ఓటమీ అను వూబి నుండి బయటపడిమపుడే నీకు  ఇహ పర లోక భోగముల గూర్చి వైరాగ్యం గలుగుతుంది. 

కామ్య కర్మకాండలు చెప్పే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకొండా నీ బుధ్ధి ఎప్పుడయితే భగవతునియందే నిశ్చలంగా ఉంటుందో అప్పుడు సంపూర్ణమయిన యోగ స్థితిని పొందెదవు., అని భగవాన్ శ్రీ కృష్ణుడు అర్జునుడితో బోధించెను.

ఆ భోధన విన్న అర్జునుడు స్థితప్రజ్ఞ (భగవత్ ధ్యాస) అను బుద్ధి యోగములో స్థిరముగా ఉండు మనుజుని ప్రవృత్తి ఎలా ఉండునూ?... అతను  ఎలా మాట్లాడును, మరియూ ఎలా కూర్చొనునూ? ఎలా నడచున? అని భగవానునితో తన సందేహం వెల్లడించెను. 

ఈ వార శారాంశము ఇంతటితో సమాప్తము 

అదనపు సమాచారము:
46 నుండీ 52వ శ్లోకములలో భగవంతుని 6 దివ్య శక్తులలో 5ని గూర్చి మనం చర్చించుకున్నాము అవి ఐశ్వర్యము, సమత్వమును, కౌశలమును, శ్రియమును, వైరాగ్యమును, జ్ఞానము.

వచ్చే వారం మనము అర్జునుని సందేహమునకు భగవాన్ శ్రీ కృష్ణ్ణుని యొక్క సమాధానం గూర్చి చర్చ జరుపుతాము. 

మీ యొక్క సందేహముల జవాబు కొరకు, మరియూ భగవద్గీతను మరింతగా అర్థం చేసుకొనుటకు ప్రతి సోమవారం నుండి శుక్రవారం 7:30AM  నుండి to  8:30AM  వరకూ జరిగే భగవద్గిత సంభాషణలో భాగం వహించండి.  అలా వీలు కానిచో  వచ్చే వారం మళ్ళీ ఈ బ్లాగ్ ను చదవండి. 

సారాంశం: JKYog India Online Class- భగవద్గీత [తెలుగు]- 1 జూలై నుండి 5 జూలై 2024 వరకు